విశాల్ నటించిన ‘మదగజరాజా’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సత్యకృష్ణన్ ప్రొడక్షన్ సిద్ధమైంది. సంక్రాంతికి తమిళనాట రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. వరలక్ష్మి, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కామెడీ, యాక్షన్ ప్రేక్షకులను అలరిస్తోందని మూవీ టీం తెలిపింది. 12ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాలతో ఇంతకాలం విడుదల కాలేదు.
మదగజరాజా మూవీ సక్సెస్ మీట్ లో విశాల్ తన కొత్త సినిమాలను ప్రకటించాడు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరియు అజయ్ జ్ఞానముత్తులతో తన నెక్స్ట్ సినిమాలు రాబోతున్నాయని విశాల్ వెల్లడించాడు. అలాగే థియేటర్లలో మదగజరాజా సినిమాను వీక్షించిన డైరెక్టర్ సుందర్ సి, హీరో విజయ్ ఆంటోని.. తనతో మరో సినిమా చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.