అందం, అభినయం, నటనా కౌశలంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించిన గొప్పనటి మాధురి దీక్షిత్. మంచి పామ్ లో ఉండగానే ప్రముఖ డాక్టర్ శ్రీరామ్ నీ పెళ్లాడి అమెరికాలో సెటిలయ్యారు. కానీ 2011లో తిరిగి వచ్చి సొంతంగా సినిమా నిర్మాణ సంస్థను స్థాపించి, నటిగాసు రీఎంట్రీ ఇచ్చారు. అయితే మాధురి దీక్షిత్ తన సుదీర్ఘమైన కెరీర్ లో రూ. 250 కోట్ల ఆస్తులు సంపాదించారు. మాధురి తన కాలంలో అత్యధిక పారితోషికం అందుకున్న నేటి కథానాయిక. తన సంపదల్ని పలు వ్యాపారాల్లోను తెలివిగా పెట్టుబడులు పెట్టింది. మీడియా కథనాల ప్రకారం ఆమె నికర ఆస్తుల విలువ రూ. 250 కోట్లు. దాదాపు 70 పైగా చిత్రాల్లో నటించిన మాధురి దీక్షిత్ ఇటీవల భూల్ భులయా 3లో నటించింది. ఈ సినిమా దాదాపు 400కోట్లు వసూలు చేసింది. మాధురి దీక్షిత్ ప్రతి చిత్రానికి రూ. 45 కోట్లు వసూలు చేస్తుంది. పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ భారీగానే ఆర్జిస్తోందని సమాచారం. తాజాగా మాధురికి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. అదేమిటంటే మాధురి దీక్షిత్, ఆమె భర్త శ్రీరామ్, క్లినిషియన్ డాక్టర్, ఫ్లెక్స్ స్పేస్ కంపెనీ ఇన్నోవ్ 8 వ్యవస్థాపకుడు, ఫ్లాక్ష విశ్వవిద్యాలయం వ్యవ స్థాపక సభ్యుడు, ఏంజెల్ ఇన్వెస్టర్ డాక్టర్ రితేష్ మాలిక్ తో కలిసి ఓయో కంపెనీకి సంబంధించిన 2 మిలియన్ షేర్లను కొనుగోలు చేశారని ఆ సంస్థ తెలిపింది.