మహానటి సినిమా ఫేం కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్న ఈ అమ్మడు గోవా వేదికగా తన చిరకాల స్నేహితుడు ఆంటోనితో ఏడడుగులు నడవనుంది. ఈ నెల 12న వీరి వివాహం జరగనుంది. నెట్టింట్లో ఆహ్వాన పత్రిక వైరల్ అవుతోంది. ఆంటోనీ క్రిస్టియన్ కావడంతో వీరి వివాహం, ఉదయం హిందూ సంప్రదాయపద్ధతిలో సాయంత్రం క్రిస్టియన్ పద్దతిలో వివాహం జరగనుంది. ఐదు రోజుల ముందే కీర్తి సురేష్, ఆమె కుటుంబం గోవాలో అడుగుపెట్టింది. అక్కడ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ మరో స్థాయిలో ప్లాన్ చేసారని తెలిసింది. ఈ పెళ్లి వేడుకకు కీర్తి కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధుమిత్రులు మాత్రమే ఆహ్వానిస్తూ వేడుకను ప్రయివేట్ గా ప్లాన్ చేసారు.15 ఏళ్లుగా సాగుతున్న బంధం, జీవితకాలం కంటిన్యూ అవుతుందని చెప్పారు కీర్తీ సురేష్. కొచ్చికి చెందిన వ్యాపారవేత్త ఆంటోని తట్టిల్ కేరళలో ప్రముఖ రిసార్ట్ చైన్కు యజమాని.