రాజమౌళి హీరో అంటే సినిమా స్టార్ట్ కావడానికి ముందే లుక్ అస్సలు బయటకు రాదు. వస్తే ఆయన సీరియస్ అవుతాడు. అందుకే హీరోలంతా మ్యాగ్జిమం జాగ్రత్తలు తీసుకుంటారు. బట్ రాజమౌళి కొన్నాళ్లుగా కొత్త లుక్ తో కనిపిస్తూనే ఉన్నాడు. ఏర్ పోర్ట్ లోనో, ఏదైనా ఫంక్షన్ లోనో కనిపిస్తూ కొత్త లుక్ పై ఆసక్తి పెంచుతున్నాడు. ఆ టైమ్ లో కాస్త ఎక్కువ గడ్డం పెంచుకుని కనిపించాడు. బట్ లేటెస్ట్ లుక్ చూసి చాలామంది షాక్ అవుతున్నారు. అచ్చం జీసస్ క్రైస్ట్ లుక్ తో కనిపిస్తున్నాడు సూపర్ స్టార్. కొన్నాళ్ల క్రితం సూపర్ స్టార్ కృష్ణ నటించిన శాంతి సందేశంలో జీసస్ లుక్ అచ్చు ఇలాగే ఉంది. ఇప్పుడు మహేష్ కూడా అలాగే కనిపిస్తున్నాడు.
నిజానికి రాజమౌళితో మూవీ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే అడ్వెంచరస్ యాక్షన్ మూవీ అన్నారు. కానీ ఈ లుక్ అందుకు భిన్నంగా కనిపిస్తుండటం విశేషం. ఏదైనా బ్యాక్ డ్రాప్ లో కనిపించే గెటప్ కావొచ్చేమో కానీ.. తాజాగా ఏపి, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు వరదల బారిన పడ్డాయి. ఈ క్రమంలో తన వంతుగా రెండు రాష్ట్రాలకు చెరో 50లక్షల ఆర్థిక సాయం ప్రకటించాడు మహేష్ బాబు. ఆ చెక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందిస్తూ ఈ లుక్ తో బయటపడ్డాడు మహేష్ బాబు. తనతో పాటు భార్య నమ్రత కూడా ఉంది. లాంగ్ హ్యాండ్ వైట్ టీషర్ట్, డెనిమ్ ప్యాంట్ తో ఉన్న ఈ లుక్ లో మహేష్ మాత్రం అదిరిపోయాడు అనే చెప్పాలి. ప్రస్తుతం మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.