పిఆర్ అంటే హీరోల బాగు కోరతారు. అభిమానులకు, హీరోలకు మధ్య వారథిగా ఉంటారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు పి.ఆర్ ఈ విశ్వంలో తనంత తోపు పీఆర్వో లేడు అన్నట్టుగా ఫీలవుతున్నాడు. అది మంచికే అయితే బానే ఉండేది. కానీ ఇతను మహేష్ ఇమేజ్ ను డామేజ్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అతను హీరోకు పి.ఆర్ గా కాక.. వైఎస్ఆర్సీపీ ఏజెంట్ గా మారాడు. మహేష్ అభిమానులను వైసీపీకి అనుకూలంగా మార్చే కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు.
కొన్నాళ్లుగా మహేష్ బాబుకు అనుకూలంగా ఉన్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ తో పాటు యూ ట్యూబ్ ఛానల్స్ లో వైఎస్ఆర్సీపీ అభిమానులతో ఇంటర్వ్యూస్ ఏర్పాటు చేస్తూ.. వారిని ఆ పార్టీకి అనుకూలంగా మార్చేలా వ్యవహరిస్తున్నాడు.. అనే ఆరోపణలు విపరీతంగా వస్తున్నాయి.
నిజానికి మహేష్ బాబు అంటే ఇండస్ట్రీలోనే కాదు.. రాజకీయ వ్యవహారాల్లోనూ అజాత శతృవు. తన సొంత బావ గల్లా జయదేవ్ ఎమ్.పిగా ఉన్నా.. ఎప్పుడూ రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకోలేదు. ఎవరి కోసమూ.. చిన్న పొలిటికల్ ఫేవర్ కూడా చేయలేదు. అలాగే కొన్నాళ్ల క్రితం తెలుగు సినిమా పరిశ్రమ నుంచి చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్ తో మహేష్ బాబు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ను కలవడానికి వెళితే వారందరినీ అతను దారుణంగా అవమానించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా కొందరు బాహాటంగానే విమర్శలు చేసినా మహేష్ బాబు ఏనాడూ దాని గురించి ఎవరి వద్దా కనీసంగా కూడా ప్రస్తావించలేదు. అంత హుందాగా ప్రవర్తించాడు ఆయన. అంత బ్యాలన్స్ డ్ గా ఉన్న సూపర్ స్టార్ ను వైసీపీకి అనుకూలంగా ఉన్నాడు అని అభిమానులంతా భావించేలా వారిని వైసీపీ కార్యకర్తలుగా మలచడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నాడు ఈ పి.ఆర్.
ఇంకా దారుణం ఏంటంటే.. ఈ మధ్య మహేష్ బాబు చేసిన కొన్ని యాడ్స్ కు సంబంధించిన డీలర్ షిప్ ను అభిమానులకే ఇప్పిస్తాం అనే మరో మోసానికి తెరలేపాడు. ఇప్పటికే అభిమాన హీరోల సినిమాలను మొదటి రోజే చూడాలని జేబులు గుల్ల చేసుకుంటోన్న ఫ్యాన్స్ ను ఈ రకంగా మోసం చేయడానికి కొత్త ఎత్తులా కనిపిస్తోందంటున్నారు. అయితే ఈ డీలర్ షిప్ వ్యవహారం కూడా ఎవరైతే వైసీపీకి అనుకూలంగా మారుతున్నారో వారికే ఇప్పిస్తా అనేలా ప్రోత్సహిస్తున్నారట. ఈ విషయం మహేష్ బాబుకు తెలిసే అవకాశమే లేదు. కానీ ఆయన బిజినెస్, యాడ్స్ లాంటి వ్యవహారాలు చూసుకునే భార్య నమ్రతకు కొంచెం తెలిసే అవకాశం ఉందంటున్నారు. కాకపోతే నమ్రత అభిమానుల కోసమే అనుకుంటుందేమో తెలియదు కానీ.. ఆ పీఆర్ మాత్రం వైసీపీ ఏజెంట్ లా మారి.. తను చెప్పినట్టు వినే వారికే డీలర్ షిప్స్ ఇప్పిస్తాననేలా చక్రం తిప్పుతున్నాడు.
వ్యాపారం అనేది బాగా తెలిసిన వారికి సంబంధించిన వ్యవహారం. ఎన్నో లోతులు తెలిస్తే కానీ వ్యాపారాల్లోకి దిగకూడదు అంటారు. అలాంటిది అభిమానులను అందులోకి లాగుతూ ఇన్ డైరెక్ట్ గా ట్రాప్ చేయబోతున్నారు అంటున్నారు. హీరో మీద అభిమానంతో డీలర్ షిప్ తీసుకుంటే వారి జీవితాలే ప్రమాదంలోకి పడిపోతాయి. అయినా మహేష్ బాబు అభిమానుల జీవితాలను కూడా ఫణంగా పెట్టి తను అభిమానిస్తున్న జగన్ పార్టీకి మేలు చేయాలని చూస్తుండటం మాత్రం క్షమించరాని తప్పు. ఇతను చేస్తోన్న తప్పు మహేష్ బాబుకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో కానీ.. తెలియకపోతే ఆయన ఫ్యాన్స్ మోసపోతారు. తద్వారా ఆయన ఇమేజ్ దెబ్బతింటుంది. ఇన్నాళ్లూ వైట్ పేపర్ లా ఉన్న మహేష్ బాబు వ్యక్తిత్వంపై వైసీపీ జెండా మరకలు అంటే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని వీలైనంత త్వరగా నివారించుకుంటే మంచిది.