Mahesh Look : మహేశ్ లుక్కు అదిరింది.. అక్క మంజుల ఆనందం వైరల్

Update: 2024-04-29 07:51 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మంజుల వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మహేశ్ లాంగ్ హెయిర్ లుక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. రాజమౌళి సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్ పెంచుకుంటున్నాడు.

క్యాప్ తీసేసి తన హెయిర్ స్టైల్ ను మహేశ్ రివీల్ చేయడం విశేషం. త్వరలోనే వివరాలు బయటకు రాబోతున్నాయని.. ప్రెస్ మీట్ ఉండబోతోందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలిసి ఒక ఫోటో సెషన్ లో రీసెంట్ గా పాల్గొన్నాడు మహేష్. లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఒక పెళ్లిలో కనిపించాడు.

ఇదే పెళ్లికి మహేష్ సోదరి మంజుల కూడా అటెండ్ అయ్యింది. మహేష్ ని చూడగానే దగ్గరకు వెళ్లి అతని జుట్టుని టచ్ చేసింది. మహేష్ ఆమెను వద్దు అన్నట్టుగా చెప్పాడు. ఇద్దరు నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Tags:    

Similar News