సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ శివారులోని జల్‌పల్లిలో ఉండే ఆయన నివాసంలో 10 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా మోహన్ బాబు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ జరిపి తిరుపతిలో దొంగను పట్టుకున్నారు. ప్రస్తుతం చోరీపై దర్యాప్తు జరుగుతోంది. దొంగతనం చేసింది నాయక్ గా పోలీసులు గుర్తించారు. ఈ నాయక్ కొన్నాళ్లు గా మోహన్ బాబు ఇంట్లో పని చేస్తున్నాడు. దొంగతనం చేసిన డబ్బు తో నాయక్ తిరుపతి పారిపోయాడు. అక్కడే పోలీసులు అతనిని పట్టుకున్నారు.
2019లో కూడా మొహన్ బాబు ఇంట్లో చోరీ జరిగిందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే పనిమనిషే డబ్బు నగలు చోరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా.. ఇంట్లో పనిచేసే వాళ్లే దొంగతనం చేశారని ఫిర్యాదు చేయడం కొసమెరుపు. అయితే అప్పట్లో ఫిల్మ్ నగర్ ఇంటిలో దొంగతన జరగ్గా.. ఇప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతం జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగిందని ఫిర్యాదు చేశారు.