అందాల ఆరబోతతో ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్ గా మారిన ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. ఈ అమ్మడు బట్టంబోలే అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన పేట అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఈ అమ్మడు వెనక్కి తీసుకోలేదు. ఆఫర్ల ప్రభంజనం కొనసాగు తోంది. తెలుగులో ప్రస్తుతం డార్లింగ్ హీరో ప్రభాస్ సరసన రాజాసాబ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో మాళవికతో పాటు నిధి అగర్వాల్ కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవే గంగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటూ తన అందాలతో అదరహో అని పిస్తోందీ అమ్మడు. ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమా ధానాలు చెప్పింది ఈ చిన్నది. అయితే ఓ నెటిజన్ మాళవికను డైరెక్ట్ గా మీరు వర్జినా అని క్వశ్చన్ చేశాడు. దానికి మాళవిక.. ఈ రకమైన చెత్త ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు. ఇలాంటివి అడగడం మానేయండి అంటూ వార్నింగ్ ఇచ్చింది. మాళవిక కోపానికీ ఓ అర్థం ఉందంటు న్నారు ఆమె అభిమానులు. మాళవిక చేసిన ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.