ప్రస్తుతం ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న మూవీ ది రాజాసాబ్. ప్రభాస్ కు జోడీగా మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాళవిక కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ తో షూటింగ్ చాలా సరదాగా ఉందని చెప్పుకొచ్చింది. హారర్, కామెడీ, రొమాంటిక్ కథతో మూవీ తెరకెక్కుతోంది. బాహుబలి సినిమా చూసిన తర్వాత ప్రభాస్ తో వర్క్ చేయాలనుకున్నానని చెప్పింది. అప్పుడే తనకు సలార్ మూవీలో అవకాశం వచ్చిందని, కానీ అనుకోని కారణాలతో ప్రాజెక్టు చేయలేకపోయానని తెలిపింది. కానీ కొన్ని నెలల తర్వాత మారుతి నుంచి రాజాసాబ్ కోసం ఆఫర్ ఇచ్చారు. ప్రభాస్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని రాసి పెట్టి ఉందేమో అనుకున్నానని చెప్పింది.