Malavika Mohanan: ప్రేమలో పడ్డ కోలీవుడ్ బ్యూటీ.. బాయ్‌ఫ్రెండ్ పేరు బయటపెట్టడానికి కండీషన్..

Malavika Mohanan: ఇటీవల మాళవిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది.

Update: 2022-02-09 06:50 GMT

Malavika Mohanan (tv5news.in)

Malavika Mohanan: కొంతమంది హీరోయిన్స్ సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ.. ఫాలోవర్స్‌తో టచ్‌లో ఉంటారు. అలాంటి హీరోయిన్స్‌లో తమిళ భామ మాళవిక మోహనన్ కూడా ఒకరు. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా తన పర్సనల్ విషయాలు కొన్ని బయటపెట్టింది మాళవిక.

మాళవిక మోహనన్ ఇటీవల మాల్దీవ్స్‌కు వెళ్లింది. అక్కడ ఆమె దిగిన ఫోటోలు కొన్నిరోజుల పాటు సోషల్ మీడియాను కుదిపేసాయి. టూ పీస్ దుస్తుల్లో చాలా హాట్‌గా కనిపించింది ఈ కోలీవుడ్ భామ. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా తాను ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టేసింది. కానీ బాయ్‌ఫ్రెండ్ ఎవరో చెప్పడానికి మాత్రం తన ఫాలోవర్స్‌కు ఒక కండీషన్ పెట్టింది.

ఇటీవల మాళవిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో వాలెంటైన్స్ కోసం తాను ఒక గిఫ్ట్ తీసుకున్నట్టు తెలిపింది. కానీ అది అబ్బాయిలకు ఉపయోగపడేది కదా అని అడగగా.. అవును అది నా వాలెంటైన్‌కు ఇవ్వడానికే అని సమాధానం ఇచ్చింది. తన పేరు చెప్పమంటే చెప్పకుండా ఒక కండీషన్ పెట్టింది.

ఆ వీడియోకు 1 మిలియన్ వ్యూస్ వస్తే తన బాయ్‌‌ఫ్రెండ్ పేరు రివీల్ చేస్తానని తెలిపింది మాళవిక. అయితే ఇది కేవలం తను లైక్స్ కోసమే చేస్తుంది కొందరు అంటుంటే.. నిజంగానే వ్యూస్ వస్తే.. మాళవిక తన బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్తుందని మరికొందరు ఎదురుచేస్తున్నారు.


Tags:    

Similar News