Malavika Mohanan : చీరలో మాళవిక.. నీ అందం ముందు ఎవరూ పనికి రారు

Update: 2024-12-16 07:45 GMT

మలయాళ సినిమా 'పట్టం పోల్ 'తో 2013లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ మాళవిక మోహన్. తెలుగు, తమిళం, హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ ఏడాది ఆమె యుద్ర, తంగలాన్ సినిమాలతో రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ప్రజెంట్ మాళవిక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘రాజా సాబ్' మూవీలో నటిస్తోంది. మారుతి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రాజాసాబ్ విడుదల కానుంది. మాళవిక సోషల్ మీడియా పై ఫోకస్ పెట్టింది. వరుస పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరవుతోంది. తాజాగా, ఆమె కేరళలో తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇందులో వైట్ కలర్ చీర కట్టుకుని నాజూకైన నడుము, ఎద అందాలు చూపిస్తూ అందరినీ ఫిదా చేస్తుంది. ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు నీ అందం ముందు ఎవరూ పనికి రారని కామెంట్లు పెడుతున్నారు. 

Tags:    

Similar News