Mamta Mohandas: సెట్లో మరో హీరోయిన్ ఉంటే షూటింగ్‌కి రానన్న నయన్: మమత కామెంట్

Mamta Mohandas: టాప్ హీరోయిన్ నయనతారపై నటి మమతా మోహన్ దాస్ పరోక్షంగా కామెంట్ చేశారు.

Update: 2023-03-10 07:09 GMT

Mamata Mohandas: టాప్ హీరోయిన్ నయనతారపై నటి మమతా మోహన్ దాస్ పరోక్షంగా కామెంట్ చేశారు. ఓ సినిమాకు సంబంధించి నయన్ కోసం చిత్రబృందం చేసిన పని తనను బాధించిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ సినిమా కోసం నాలుగు రోజులు వృధా చేసుకున్నానని అన్నారు.''రజనీకాంత్‌ నటిస్తున్న సినిమాలో నాకు అవకాశం వచ్చింది. అందులో ఓ పాట కోసం నన్ను సంప్రదించారు. దాదాపు నాలుగు రోజులు షూటింగ్ చేశాం. షూటింగ్‌లో ఉండగానే ఆ ఫ్రేమ్‌లో నేను లేనని అర్థమైంది. ఫైనల్ కాపీ బయటకు వచ్చే సమయానికి, నా షాట్‌లు ఏవీ లేవు. కేవలం ఒక్క షాట్‌లో వెనుక నుండి కనిపిస్తాను. నాకు ముందు చెప్పినట్లు ఆ పాట చిత్రీకరించలేదు. అయితే కొంత కాలం తర్వాత ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఆమె వల్లే నా పాత్ర పరిధి తగ్గిందని తెలిసిన వారు చెప్పారు. ఆ పాటలో మరో హీరోయిన్ ఉన్నట్టు ఆమెకు సమాచారం అందడంతో షూటింగ్‌కు రాలేదని.. అందుకే నా పార్ట్ షూట్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఆ సినిమా కోసం నాలుగు రోజులు వృధా చేశాను. ఈ మొత్తం వ్యవహారం చూసి నేను చాలా బాధపడ్డాను' అని మమతా మోహన్‌దాస్ అన్నారు. రజనీకాంత్-నయనతార జంటగా నటించిన చిత్రాల్లో 'కథానాయకుడు' ఒకటి. 2008లో విడుదలైన ఈ సినిమాలో మమతా మోహన్‌దాస్ అతిథి పాత్రలో కనిపించారు. ఇందులోని “దేవుడు స్వర్గం నుండి వచ్చాడు” అనే పాటలో ఆమె ఒక చోట మెరిసింది. మమత చేసిన వ్యాఖ్యలు 'కథానాయకుడు' సినిమా గురించే అయి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.

Tags:    

Similar News