Manchu Lakshmi : ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మీ

Update: 2025-08-13 16:15 GMT

బెట్టింగ్ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో పలువురు ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన అధికారులకు వారిని విచారించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న హైదరాబాద్‌ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ ఉదయం 10:30కు ఆమె బషీర్‌బాగ్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు. బ్యాంక్ ఖాతాకు సంబంధించిన అన్ని స్టేట్మెంట్లను తీసుకొని రావాలని ఈడీ తన నోటీసులో పేర్కొంది. YOLO 247 అనే బెట్టింగ్ యాప్ని ఆమె ప్రమోట్ చేసిందని...అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేసినట్లు ఆమెపై అభియోగాలు ఉన్నాయి.దీంతో తెలంగాణ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ సంస్థల నుంచి ఆర్థికపరమైన లావాదేవీలపై మంచు లక్ష్మిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రాణా ఈడీ అధికారులు ముందు విచారణకు హాజరయ్యారు.

Tags:    

Similar News