ఆదివారం ఉదయాన్నే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి సంచలన వార్తలు వినిపించాయి. మోహన్ బాబు, మనోజ్ ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని న్యూస్. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మనోజ్ తన తండ్రి తనను కొట్టాడనీ,, కొడుకు మనోజే తనను కొట్టాడని కంప్లైంట్స్ చేసుకున్నారు అనడం. అంటే తండ్రి కొడుకులు కొట్టుకున్నారు అనేది సారాంశం. దీంతో మేటర్ సెన్సేషనల్ గా మారింది. అన్ని మీడియా సంస్థల్లోనూ ఇదే వార్త కనిపించింది. వీరు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారని కూడా చెబుతున్నారు. మనోజ్ వెంట ఆయన భార్య కూడా ఉందట. ఆమెపై దాడి చేశారు అంటున్నారు.
తన మొదటి భార్యతో విడిపోయిన దగ్గర నుంచి మనోజ్.. మోహన్ బాబుతో కలిసి ఉండటం లేదు.. మాట్లాడటం కూడా లేదు. రెండో పెళ్లి విషయంలో మనోజ్ చూసుకున్న అమ్మాయి మోహన్ బాబుకు నచ్చలేదనీ.. ఫ్యామిలీ అంతా కలిసి కన్విన్స్ చేసి పెళ్లికి వచ్చేలా చేశారని చెప్పుకున్నారు. ప్రస్తుతం మనోజ్ హీరోగానే కాక రకరకాల పాత్రలతో బిజీ అవుతున్నాడు. ఈ టైమ్ లో ఇలాంటి వార్త అంటే ఖచ్చితంగా సెన్సేషనల్ అవుతుంది కదా..?
అయితే ఈ విషయంలో నిజం లేదు అంటూ మంచు ఫ్యామిలీ పిఆర్ టీమ్ నుంచి న్యూస్ వచ్చింది. మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు అనే వార్తల్లో నిజం లేదు. ఇవన్నీ ఊహాజనితమైనవి. మీడియా సంస్థలు నిజాలు తెలుసుకోకుండా వార్తలు ప్రసారం చేయొద్దు అనేది పిఆర్ టీమ్ చేసిన విన్నపం. కానీ ఇదంతా పొడిపొడిగానే ఉంది తప్ప.. స్పష్టమైన వివరణ ఇచ్చినట్టుగా కనిపించడం లేదు. అందుకే పోలీస్ స్టేషన్ కంప్లైంట్స్ నిజమే అంటున్నారు కొందరు.
అయినా నిప్పులేకుండా పొగ రాదు కదా..