Mani Ratnam : మణిరత్నం నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్

Update: 2025-08-05 10:45 GMT

ప్రస్తుతం ఉన్న ఇండియన్ లెజెండరీ దర్శకుల్లో ఖచ్చితంగా ఉండే పేరు మణిరత్నం. ఒకప్పుడు వెండితెరపై అద్భుతమైన దృశ్య కావ్యాలు ఆవిష్కరించిన మణిరత్నం కొన్నాళ్లుగా టచ్ కోల్పోయాడు. అన్నిటికి మించి చివరగా వచ్చిన థగ్ లైఫ్ తో ఓ రకంగా అభాసుపాలయ్యాడు అని చెప్పినా తప్పు లేదేమో. క్రేజీ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఏ సన్నివేశంలోనూ మణిరత్నం మూవీ అనిపించుకోలేదు. చీప్ స్టోరీగానూ విమర్శల పాలైంది. దీంతో ఇప్పట్లో మణిరత్నం నుంచి మరో సినిమా రాదేమో అనుకున్నారు. బట్ లెజెండ్స్ కు ఇలాంటివి బ్రేక్ లు వేయలేవు కదా. అందుకే ఈ సారి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు.

విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా మణిరత్నం నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ధృవ్ ఇప్పుడిప్పుడే ప్రామిసింగ్ హీరోగా ఎదుగుతున్నాడు. ప్రస్తుతం మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో బైసన్ అనే సినిమా చేస్తున్నాడు. అది చివరి దశలో ఉంది. కంప్లీట్ కాగానే మణిరత్నం మూవీ మొదలవుతుంది. ఈ నవంబర్ నుంచే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ను ఫిక్స్ చేశారు. మరి ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తో మణిరత్నం బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.

Tags:    

Similar News