Maniratnam : మణిరత్నంకు కరోనా.. చెన్నై అపోలో ఆసుపత్రిలో అడ్మిట్..

Maniratnam : మణిరత్నంకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.;

Update: 2022-07-19 05:45 GMT

Maniratnam : కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రముఖులు ఎంత జాగ్రత్తలు పాటించినప్పటికీ వారు కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా లెజండరీ డైరెక్టర్ మణిరత్నంకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మణిరత్నం భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ - 1 సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఇటీవీల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కార్యక్రమంలో ఎవ్వరూ కోవిడ్ నిబంధనలను పాటించలేదు. అప్పుడే మణిరత్నంకు కరోనా సోకి ఉండవచ్చని అనుకుంటున్నారు. మరోవైపు మణిరత్నం త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

Tags:    

Similar News