Meenakshii Chaudhary : ముద్దు సన్నివేశాల్లో నటించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు : మీనాక్షి చౌదరీ
Meenakshii Chaudhary : రవితేజ హీరోగా, రమేష్ వర్మ డైరెక్షన్‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ఖిలాడి... మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయాతీలు హీరోయిన్స్‌గా నటించారు.;
Meenakshii Chaudhary : రవితేజ హీరోగా, రమేష్ వర్మ డైరెక్షన్‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ఖిలాడి... మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయాతీలు హీరోయిన్స్‌గా నటించారు. అనసూయ, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. మూవీ ప్రమోషన్‌లో సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ని నిన్న(మంగళవారం) రిలీజ్ చేశారు మేకర్స్.
అయితే చిత్ర ట్రైలర్‌లో రవితేజ, మీనాక్షి చౌదరీల మధ్య లిప్ లాక్ సీన్‌ని చూపించాడు దర్శకుడు.. దీనిపైన మీనాక్షి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. కథకు అవసరం కనుకనే అలా చేశానని, కథ చెప్పినప్పుడే దర్శకుడు ఈ సన్నివేశం గురించి వివరించారని తెలిపింది. ఇలాంటివి కమర్షియల్ సినిమాల్లో భాగమేనని, ముద్దు సన్నివేశాల్లో నటించడంలో తనకి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది.
ఇక రెండో సినిమాని ఏకంగా రవితేజ లాంటి స్టార్ తో చేస్తానని అనుకోలేదని, దీనిని అదృష్టంగా భావిస్తున్నట్టుగా వెల్లడించింది. ఖిలాడి చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని, హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేసింది మీనాక్షి.