ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్టస్ ఐకానిక్ హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. సిల్వర్ స్క్రీన్, వెలుపల కూడా ఆకట్టుకుంటూనే ఉంటుంది ఆ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళం, హిందీలో దాదాపు 85 చిత్రాల్లో నటించి చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. మల్టీ టాలెంటెడ్ కు పేరుగాంచిన ఈ మిల్కీబ్యూటీ.. ఇప్పటికే రెండు సంతోషం ఫిల్మ్ అవార్డులు, ఒక సైమా, కలైమామణి అవార్డుతో సహా అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకుంది. ఇండస్ట్రీలో అద్భుతమైన ఈ జర్నీ ఆమెను తెలుగు, తమిళ చిత్ర పరి శ్రమలలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా చేసింది. ఓ వైపు సినిమాలు, సిరీస్ లు చేస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ లోనూ ఆడిపాడుతోంది ఈ భామ. రీసెంట్ గా ఓదెల 2 మూవీలోనూ మెరిసింది. రైడ్ 2లో స్పెషల్సాంగ్తో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు దగ్గరవుతూ ఉంటుంది తమన్నా. తాజాగా ఈ మిల్క్ బ్యూటీ ఇన్స్టాలో కొన్ని స్టన్నింగ్ ఫొటోస్ షేర్ చేసింది. బ్లాక్స్లో మత్తెక్కించే అందాలతో మెరిసిపోతుం ది. మిల్క్ బ్యూటీ సొగసులు.. డీప్ నెక్ గౌన్ క్యూట్ లుక్స్ మెస్మరైజ్ చేస్తోంది. జీ సినీ అవార్డ్స్ కోసం ముస్తాబైన ఈ లుక్లో అదిరిపోయింది. ఈపిక్స్కు 'ఆడియన్స్కు డెడికేట్ చేసిన ఆ నైట్ కోసం' అంటూ క్యాప్షన్ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముద్దుగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడు తున్నారు. టాకీస్