మిర్చి నటి మాధవి తన కెరీర్‌లో ఎదురైన లైంగిక వేధింపుల గురించి తెలపడం జరిగింది. మిర్చి మాధవికి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా మిర్చి తర్వాత మాధవి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మిర్చి సినిమా హిట్ కావడంతో మాధవికి వరుస సినిమాల్లో ఆఫర్లు వెల్లువెత్తాయి. మాధవి తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన కెరీర్ ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.
ఒక సినిమాలో నన్ను సెలెక్ట్ చేశారు. డైరెక్టర్‌కి సంబంధించిన వ్యక్తి ఫోన్ చేసి.. మీకు ఈ చిత్రంలో పాత్ర ఉండాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి. మొత్తం 5 మంది ఉన్నాం అని అన్నాడు. ఇంకోక్కసారి ఫోన్ చేస్తే గుడ్డలూడదీసి కొడతా అని అరిచేశా.. వెంటనే అతను ఫోన్ పెట్టేశాడని నటి మాధవి తెలిపింది.
ఆ తర్వాత తనని ఎవరూ కమిట్మెంట్ అడగలేదని మిర్చి మాధవి తెలిపింది. కాస్టింగ్ కౌచ్ అనేది ఒకవైపే ఉండదు అని మనకి ఇష్టం లేకుంటే ఎవరూ టచ్ చేయరని చెప్పారు. . మనం చనువు ఇస్తేనే అవతలి వాడి రెచ్చిపోతాడు అని ఆమె తెలిపారు.