స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సైరా దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి విడాకులు ప్రకటించిన కాసేపటికే తన భర్త నుంచి విడిపోతున్నట్టు రెహమాన్ టీమ్ లోని బాసిస్ట్ మోహిని డే తెలిపింది. వీరిద్దరూ ఒకే రోజు విడాకులు ప్రకటించడంతో.. ఇద్దరి మధ్య సంబంధం ఉందని అందుకే విడాకులు తీసుకుంటున్నారని నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ పుకార్లపై మోహిని డే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో క్లారిటీ ఇచ్చింది. 'నేను విడాకులు తీసుకుంటున్నట్టు చెప్పిన తర్వాత చాలా మంది నా ఇంటర్వ్యూ అడిగారు. కానీ వారు ఎందుకు ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారో నాకు తెలుసు. చెత్త వార్తలను ప్రచారం చేసేందుకు నాకు ఆసక్తి లేదు. ఇలాంటి రూమర్స్ పై మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోను. దయచేసి నా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి' అంటూ మోహిని డే చెప్పుకొచ్చింది.