సీమా హైదర్ కు సినిమా ఛాన్స్.. రా ఆఫీసర్‌గా..
ఏదో అనుకుంటే మరేదో జరిగింది. ప్రియుడి కోసం పాకిస్థాన్ నుంచి వచ్చింది. ఇప్పుడు సినిమాలో నటించే అవకాశం వచ్చింది.;
ఏదో అనుకుంటే మరేదో జరిగింది. ప్రియుడి కోసం పాకిస్థాన్ నుంచి వచ్చింది. ఇప్పుడు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. జానీ ఫైర్‌ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ బృందం మంగళవారం గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్న పాకిస్థానీ మహిళ సీమా హైదర్‌ను కలిసింది. ఉదయపూర్ టైలర్ కన్హయ్య లాల్‌ను ఇస్లామిక్ రాడికల్స్ హత్య ఆధారంగా వారి రాబోయే చిత్రం 'ఎ టైలర్ మర్డర్ స్టోరీ' కోసం ఆమెను ఆడిషన్ చేసింది. చిత్ర దర్శకులు జయంత్ సిన్హా మరియు భరత్ సింగ్‌లు కూడా ఆమెను కలిశారు.
అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి, ఐఎస్‌ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న సీమా హైదర్ ఈ సినిమాలో రా ఆఫీసర్‌గా నటించనున్నారు. సీమా.. సచిన్ కోసం పాకిస్తాన్‌లో ఉన్న తన కుటుంబాన్ని విడిచిపెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో సీమా హైదర్, ఆమె ప్రియుడు సచిన్ మీనా కొత్త ఇంటికి మారిన తర్వాత వారు ఎదుర్కొన్న ఇబ్బందులను వీడియో చూపించారు. దీంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు అదే సినిమా అవకాశాన్ని తెచ్చి పెట్టింది.
ఆహారం మరియు ఇతర అవసరమైన వస్తువుల కొరతను ఎదుర్కొంటున్నందున తాము జీవించడానికి చాలా కష్టపడుతున్నామని దంపతులు పేర్కొన్నారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో PUBG ఆడుతున్నప్పుడు గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివసిస్తున్న 22 ఏళ్ల భారతీయ వ్యక్తి సచిన్ మీనాతో తాను ప్రేమలో పడ్డానని 30 ఏళ్ల పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ చెప్పారు.
అప్పటికే గులాం హైదర్‌తో వివాహమై నలుగురు పిల్లలు ఉన్న సీమా.. సచిన్‌తో కలిసి ఉండేందుకు పాకిస్థాన్‌ను విడిచి అక్రమంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంది. ఆమె మొదట మార్చిలో నేపాల్‌లో సచిన్‌ను కలుసుకుంది. సీమా హిందూ మతంలోకి మారిన తర్వాత ఇద్దరూ హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మే 13న ఆమె పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించారు.
జూలై 4న, సీమా భారతదేశంలోకి అక్రమంగా చొరబడినందుకుగాను అరెస్టు చేయబడింది. అంతేకాకుండా ఆమెకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్ ని, అతని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైనప్పటికీ , దర్యాప్తు సంస్థలు ఈ జంటను ప్రశ్నిస్తున్నాయి.
ఇంతలో, సౌదీ అరేబియాలో పని చేస్తున్న సీమా భర్త గులామ్ తన భార్య, పిల్లలతో తిరిగి కలవాలని కోరుకున్నాడు. కానీ సీమకు భర్తతో ఉండడం ఇష్టం లేదు. తనను ఏనాడు ప్రేమగా చూడలేదని, పైగా వేధింపులకు గురి చేసేవాడని పేర్కొంది. అందుకే ఇప్పుడు అతడు రమ్మన్నా వెళ్లనని అంటోంది. తనకు సచిన్‌తో కలిసి జీవించాలని ఉందని సీమా చెప్పింది.