Raviteja : పాటంటే అర్థనగ్న ప్రదర్శనేనా.. మిస్టర్ బచ్చన్

Update: 2024-08-02 11:56 GMT

రవితేజ హీరోగా నటించిన సినిమా మిస్టర్ బచ్చన్. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేశాడు. ఒకప్పటి బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కూతురు భాగ్యశ్రీ బోర్సే ఈ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఈ నెల 15న విడుదల కాబోతోన్న ఈ మూవీ నుంచి మరో సాంగ్ విడుదల చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ పాటను వనమాలి రాశాడు. చాలా గ్యాప్ తర్వాత వనమాలి ఓ పెద్ద సినిమాకు సాహిత్యం అందించడం విశేషం. సాహిత్య పరంగా చాలా బావున్న ఈ పాట చిత్రీకరణ పరంగా మాత్రం బి గ్రేడ్ ను తలపిస్తోంది. హీరోయిన్ అంగాంగ ప్రదర్శనే అంతిమం అన్నట్టుగా.. ఆమెను శరీరాన్ని అదే పనిగా తడమడమే రొమాన్స్ అన్నట్టుగా చిత్రీకరణ ఉంది.

తన వయసులో సగానికంటే తక్కువ ఉన్న హీరోయిన్ తో రవితేజ చేసిన రొమాన్స్ చూస్తే అదోరకంగా ఉంది తప్ప సహజంగా కనిపించడం లేదు. హీరోయిన్ ప్రేమలో పడిన ఓ ‘వ్యక్తి’ఆమెను తలచుకుంటూ తనకు ఆమె శరీరంలో నచ్చిన అంశాలను పొగిడేస్తూ కనిపించిందీ పాట. దీనికంటే ముందు వచ్చిన పాట సైతం సెడక్టివ్ గానే ఉందనే కమెంట్స్ ఉన్నాయి. ఇదీ అందుకు మినహాయింపు కాదు. ఎంత కమర్షియల్ సినిమా అయినా.. లేస్తే అందరి గురించి అదే పనిగా నిక్కచ్చిగా ఉండాలని మాట్లాడే హరీశ్ శంకర్ లాంటి దర్శకుడు ఈ తరహా పాటలను ఎంకరేజ్ చేయడం అంటే కేవలం అన్నయ్య రవతేజ కోసమే అయి ఉంటుందా లేక నిజంగానే పాట అంత శరీర ప్రదర్శనను డిమాండ్ చేసిందా అనేది వారికే తెలియాలి.

Tags:    

Similar News