సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'సస్నాఫ్ సర్దార్ 2. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహిస్తున్నా డు. దేవ్రణ్ ఫిల్మ్స్, జియో స్టూడి యోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని జ్యోతి దేశ్పాండే, అజయ్ నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ నేపథ్యంలో రా బోతున్న ఈ మూవీలో సంజయ్ దత్, సాహిల్ మెహతా, సంజయ్ మిశ్రా, రవికృష్ణ కీలక పాత్రలో నటించారు. సినిమా రిలీజ్ సందర్భంగా మృణాల్ ఇన్ స్టా వేదికగా ఓ పోస్టు పెట్టింది..అదేమి టంటే.. ' మృణాల్ తన ఇన్స్టా వేదికగా ఎమోషన ల్ స్టోరీ షేర్ చేసింది. 'ఎంతో అంకితభావంతో.. నెలల తరబడి నిద్రలే ని రాత్రులు, లెక్కలేనన్ని క్షణాలు, ఇష్టం, పట్టుదలతో కృషి చేసిన తర్వాత.. మా ప్రేమ, శ్రమ చివరకు రేపు విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ మా హృదయాన్ని, ఆత్మను నింపాం. ప్రతి సన్నివేశం మన జీవితా లకు దగ్గరగా అనిపిస్తుంది. నేను చెప్పగలిగేది ఒక్కటే.. ఈ సినిమా నా హృదయానికి ఎంతో దగ్గరైంది. చాలా కాలం తర్వాత ఈ జానర్లో వస్తున్న అత్యంత అందమైన కథ ఇది. మా ఈ కుటుంబానికి ప్రేమను ఇవ్వండి' అంటూ తెలిపింది.