మృణాల్ ఠాకూర్ 2024లో విడుదలైన రెండు చిత్రాలతో సహా మొత్తం నాలుగు తెలుగు చిత్రాలలో కనిపించింది. ఈ ఏడాది విజయ్ దేవరకొండ ( Vijaya Devarakonda) సరసన "ఫ్యామిలీ స్టార్" (Family star ) లో నటించింది. రీసెంట్ గా "కల్కి 2898 AD" (Kalki 2898 AD) లో చిన్న పాత్రను పోషించింది. మొత్తం మీద జయాపజయాలతో సంబంధం లేకుండా.. మృణాళ్ ఆఫర్స్ అందుకుంటూ సత్తా చాటుకుంటోంది.
ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లో మరికొన్ని ప్రాఫిటబుల్ ఆఫర్స్ ను అందుకోవాలని ఆశిస్తోంది. అయితే టాలీవుడ్ కంటే బాలీవుడ్‌నే ఆమెకు మరిన్ని ఎక్సైటింగ్ ప్రాజెక్ట్‌లను ఆఫర్ చేస్తోంది. వరుణ్ ధావన్ నటిస్తున్న కొత్త చిత్రానికి మృణాల్ ఠాకూర్ సంతకం చేసింది. నవంబర్‌లో ఆమె షూట్‌లో జాయిన్ అవ్వాలి. వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
మృణాల్ ఠాకూర్ ఇంతకు ముందు ఈ యంగ్ బాలీవుడ్ హీరోతో అసలు వర్క్ చేయలేదు. ప్రస్తుతం మరో రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో పనిచేస్తున్నారు మృణాళ్ . ఈ ఏడాది ఆమెకు ఇది మూడో బాలీవుడ్ ప్రాజెక్ట్.