Saif Ali Khan : ఫ్రాక్చర్‌తో ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరిక
ఆసుపత్రిలో సైఫ్‌తో పాటు బాలీవుడ్ నటి కరీనా కపూర్ కూడా ఉన్నారు.;
'దేవర: పార్ట్ 1' నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈరోజు, జనవరి 22, సోమవారం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. ఆయన మోకాలు, భుజం భాగంలో ఫ్రాక్చర్‌తో బాధపడుతున్నాడు. ఈ కారణంగా ఆయన ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో సైఫ్‌తో పాటు అతని భార్య, బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ కూడా ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో, అతని అభిమానులు సైఫ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు.
సైఫ్ అలీఖాన్ ఈరోజు ఉదయం 8 గంటలకు కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ అతనికి మోకాలి శస్త్రచికిత్స జరుగుతోంది. అయితే, కరీనా కపూర్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో తన భర్తకు గాయం గురించి ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్‌లు నటిస్తోన్న సౌత్ ఫిల్మ్ 'దేవర: పార్ట్ 1'లో పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా 'బహీరా' పాత్రలో సైఫ్ నటిస్తున్నాడు. బహుశా ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగి ఉండొచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే, అంతకుముందు అతని భుజం, మోకాలికి ఫ్రాక్చర్ అయ్యిందని, ప్రస్తుతం దానికి చికిత్స కొనసాగుతోందని చెబుతున్నారు. అతని శస్త్రచికిత్స చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. అప్పుడు ఆయన అడ్మిట్ అవ్వలేదు. చాలా కాలంగా వాయిదా పడిన ఈ శస్త్ర చికిత్స ఈరోజు చేయించుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
సైఫ్ అలీ ఖాన్ గాయాల చరిత్ర
సైఫ్ అలీఖాన్‌కి ఇంత తీవ్రమైన గాయం కావడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకు ముందు షూటింగ్ సమయంలో చాలాసార్లు గాయపడ్డాడు. కంగనా రనౌత్, షాహిద్ కపూర్ నటించిన 'రంగూన్' సినిమా షూటింగ్ సమయంలో సైఫ్ బొటన వేలికి కూడా గాయమైంది. దీని తర్వాత ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది.
Saif Ali Khan hospitalised
— ANI Digital (@ani_digital) January 22, 2024
Read @ANI Story | https://t.co/s5Uqh23RZ5#SaifAliKhan #Saif #Hospitalised pic.twitter.com/02TM9Ep7a6