Meenakshi Chaudhary : నా డ్రీం ఫుల్ ఫిల్ అయ్యింది : మీనాక్షి చౌదరి

Update: 2024-11-21 13:30 GMT

ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే లక్కీ భాస్కర్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఏ బ్యూటీ త్వరలోనే మెకానిక్ రాకీ, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలు చేస్తోంది. వీటిలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కుస్తుండగా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది మీనాక్షి "ఇది ఒక డ్రీమ్ క్యారెక్టర్. నాకు చిన్నప్పటి నుంచి మూడు డ్రీమ్స్ ఉన్నాయి. ఒకటి డాక్టర్, రెండు మిస్ ఇండియా, మూడోది ఐపీఎస్ ఆఫీసర్. ఫస్ట్ రెండు కోరికలు నెరవేరాయి. ఈ మూవీతో నా మూడో డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయింది" అంటూ చెప్పింది మీనాక్షి.

Tags:    

Similar News