తాను ధరించే కురచ దుస్తులపై తన భర్త జాకీ భగ్నానీ ఎలాంటి అభ్యంతరం తెలపరని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. తన భర్త కానీ, అత్తమామలు కానీ బట్టల విషయంలో ఎలాంటి ఒత్తిడి చేయలేదని తెలిపారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోరని.. వారిది ఓపెన్ మైండ్ అని చెప్పారు. పెళ్లయితే మహిళలే తమ దుస్తుల స్టైల్ మార్చాలా అని ఆమె ప్రశ్నించారు. కాగా ఇటీవల నిర్మాత జాకీ భగ్నానీని రకుల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) పంజాబీ కుటుంబానికి చెందిన ఈ బ్యూటీ గిల్లి అనే కన్నడ సినిమాతో 2009లో మొదటిసారి వెండితెరపై మెరిసింది. టాలీవుడ్లో కెరటం అనే చిన్న సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో బ్రేక్ అందుకుంది. ఆ తర్వాత తన టాలెంట్‌తో సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో నటిస్తూనే బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అలా మోడలింగ్ నుంచి హీరోయిన్గా మంచి గుర్తింపు పొందే స్థాయికి రకుల్ చేరుకుంది.