Tollywood : నా చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది: మాళవిక మోహనన్

Update: 2024-11-04 05:00 GMT

టాలీవుడ్ లో మాళవిక మోహనన్ అంటే తెలియని వారు ఉండరు. తన అందం, అభినయంతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది ఈ మలయాళ బ్యూటీ. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తెగా 2013లో మొదటి సినిమాలోనే దుల్కర్ సల్మాన్ తో చాన్స్ కొట్టేసింది. అనంతరం కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ పేట మూవీతో ఎంట్రీ ఇచ్చి విజయ్ మాస్టర్, ధనుష్ తో మారన్, విక్రమ్ తో తంగలాన్ వంటి మూవీలో మెరిసింది. అయినా ఇవేవి అంతగా బ్రేక్ ఇవ్వలేదట. అయితే ఈ అమ్మడికి ఒక్కటే కోరిక ఉండేదట. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలన్న సుదీర్ఘ కల ఇప్పటికి నెరవేరిందని హీరోయిన్ మాళవికా మోహనన్ అంటోంది. ఈ ఎంట్రీ కూడా ఎంతో గ్రాండ్గా ఉందని అంటోంది. తాజాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'రాజాసాబ్' మూవీలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. దీనిపై ఆమె స్పందిస్తూ.. 'సరైన చిత్రం ద్వారా తెలుగులోకి అడుగుపెట్టాలన్న నా చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. 'బిగ్బాస్' అవకాశం లభించినప్పటికీ ఈ ఆఫర్ కంటే టాలీవుడ్లో ఎంట్రీనే నాకు ప్రధానం. ఇంతకంటే గొప్ప డెబ్యూ నాకు లభించదు. ఈ మూవీ కోసం అభిమానుల తరహాలోనే నేను కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను' అని పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ ఆశలన్నీ ప్రభాస్ తో రాజా సాబ్, కార్తితో సర్దార్ 2 సినిమాలపైనే ఉన్నాయి.

Tags:    

Similar News