Naa Saami Ranga : 'నా సామిరంగ' OTTలోకి వచ్చేసింది.. చూస్తున్నారా మరి

Update: 2024-02-17 10:00 GMT

Naa Saami Ranga : సంక్రాంతి కానుకగా వచ్చిన అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)   'నా సామిరంగ' (Naa Saami Ranga). మూవీ సూపర్ హిట్ గా నిలచింది. పండుగ పూట కాంపిటీషన్ లోనూ నిలబడి వందకోట్లు రాబట్టింది ఈ సినిమా. విజయ్ బిన్నీ రూపొందించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

శ్రీనివాస చిట్టూరి 'నా సామిరంగ'ను నిర్మించారు. కీరవాణి సంగీతం చార్ట్ బస్టర్ లో ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదలైన ఈ మూవీలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కూడా సపోర్టివ్ రోల్స్ పోషించారు.

యూత్ క్రష్ ఆషిక రంగనాథ్ ఈ మూవీతో అన్ని వర్గాలకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. శనివారం అర్ధరాత్రి నుంచే 'నా సామిరంగ' మూవీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లో చూడని వారు.. ఇప్పుడు ఓటీటీలో చూసేయండి.

Tags:    

Similar News