అక్కినేని నాగార్జున.. వంద సినిమాల కెరీర్ ఉన్న హీరో. తెలుగుతో పాటు హిందీలోనూ ఎప్పుడో అదరగొట్టేశాడు. ప్రస్తుతం తన కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకుంది. నా సామిరంగా కమర్షియల్ గా హిట్ అయినా.. కేవలం హీరోగానే కాక ప్రత్యేక పాత్రలు చేయడానికి కూడా వెనకాడ్డం లేదు. ఆల్రెడీ ధనుష్ తో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే మూవీ చేస్తున్నాడు. దీంతో పాటు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలీ మూవీలో సిమోన్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. రజినీకాంత్ మెయిన్ లీడ్ చేస్తోన్న ఈ మూవీలో ఇంకా ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. అయితే సడెన్ గా ఈ మూవీ నుంచి నాగార్జున హైలెట్ అయిపోతున్నాడు.
చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది కూలీ మూవీ. లోకేష్ వర్స్ లో భాగంగానే ఈ మూవీ ఉంటుందని ఊహిస్తున్నారు చాలాంది. ప్రస్తుతం నాగార్జునపై కీలక సన్నివేశాల చిత్రీకరిస్తున్నాడు లోకేష్. ఈ సీన్స్ ఇప్పుడు లీక్ అయ్యాడు. లీక్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగార్జున కత్తితో ఎవరినో అత్యంత కిరాతకంగా చంపేస్తున్న దృశ్యం చిత్రీకరిస్తున్నాడు లోకీ. అయితే ఈ వీడియో నాగ్ కొన్ని డైలాగ్స్ కూడా చెబుతున్నాడు. అవి చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. నాగ్ తరం హీరోలంతా చెన్నై నుంచే వచ్చారు. పైగా తను పుట్టింది పెరిగింది అక్కడే. అయినా తమిళ్ డైలాగ్స్ కోసం ప్రాంప్టర్ పెట్టారు. అంటే సీరియల్స్ లో ఎలాగైతే ఆర్టిస్టులకు పక్కనే ఉన్న కొందరు ప్రాంప్టింగ్ చేస్తుంటారో.. అలా నాగార్జునకు కూడా ప్రాప్టింగ్ ఇస్తున్నారు.
నిజానికి ఈ తరం హీరోలెవరూ ప్రాప్టింగ్ తీసుకోరు. అలాంటిది నాగ్ చేస్తున్నాడంటే కారణం ఏంటో కానీ.. చూడ్డానికి మాత్రం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. కాకపోతే ఆయన సొంతంగా డైలాగ్స్ చెబితే లేట్ అవుతుందనుకుని లోకేష్ ఇలా ప్రాప్టింగ్ ఇప్పిస్తున్నాడో లేక ఇంకేదైనా రీజన్ ఉందో కానీ.. మొత్తంగా ఈ వీడియో ఇప్పుడు టాప్ ట్రెండంగ్ లో ఉండటం విశేషం.