HIT : 30 రోజుల్లో నాని హిట్ వస్తోంది

Update: 2025-04-02 10:45 GMT

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ ది థర్డ్ కేస్'. శైలేష్ కొలను దర్శకుడు. 'హిట్ 'సినిమాల సిరీస్లో భాగంగా వస్తున్న మూడవ భాగమిది. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ కు మంచి స్పందన వచ్చింది. ప్రశాంతి తిపిర్నేని, నాని యునానిమస్ ప్రొడక్షన్స్తో కలిసి నిర్మిస్తున్న చిత్రమిది. నిర్మాణపనులు వేగంగా జరుగుతున్నాయి. మే ఒకటవ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అంటే మరో ముప్పైరోజుల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నాని లుక్ తో ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. ఛాయాగరణం సానుజన్ వర్గీస్, సంగీతం మిక్కీ జె. మేయర్. 

Tags:    

Similar News