హిట్ డైరెక్టర్స్ వెంట ఇండస్ట్రీ పరుగులు పెడుతుంది. అయితే హిట్ డైరెక్టర్స్ ను ఇండస్ట్రీకి అందిస్తున్నాడు నాని. తన బ్యానర్ లో పరిచయం అయిన ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను పెద్ద దర్శకులయ్యారు. ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయ్యే పొటెన్షియల్ ఉందని రీసెంట్ గా ఇదే బ్యానర్ తో పరిచయం అయిన రామ్ జగదీష్ నిరూపించుకున్నాడు. కేవలం 12 కోట్లతో రూపొందిన కోర్ట్ మూవీ 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. పైగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం లేకుండానే ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాంటి దర్శకుడికి మరింత స్వేచ్ఛనివ్వడంతో ఓ స్టార్ హీరోను కూడా ఇస్తూ నాని మరో సినిమా అతనితో చేయబోతున్నాడు అనే వార్త హల్చల్ చేస్తోంది.
ఫస్ట్ మూవీ కోర్ట్ తోనే బెస్ట్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న రామ్ జగదీష్ నాని తన బ్యానర్ లోనే మరో అకవాశం ఇస్తూ.. అతనికి హీరోగా టాప్ స్టార్ దుల్కర్ సల్మాన్ ను సెట్ చేయబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. నాని, దుల్కర్ ల స్టోరీ సెలెక్షన్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటి నాని తను స్వయంగా విన్న కథలో దుల్కర్ అయితే బావుంటాడు అని భావించడమే హైలెట్ అయితే.. దుల్కర్ ఈ కథకు ఓకే చెబితే ప్రాజెక్ట్ రేంజ్ ఓవర్ నైట్ మారిపోతుంది అనేది నిజం. కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు దుల్కర్. తను హైలెట్ అవడం కంటే కథతో తను హైలెట్ అవడం కోరుకుంటాడు. మరి ఇది అలాంటి కథే అయి ఉంటుందేమో. అందుకే దుల్కర్ కోసం ప్రయత్నిస్తున్నాడు నాని. మరి నాని చెబితే దుల్కర్ నో అంటాడా.. సో.. అతను ఓకే అంటే ఓ క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధం అవుతున్నట్టే. అలాగే నాని ‘వాల్ పోస్టర్’ పై మరో బ్లాక్ బస్టర్ బొమ్మ పడటం ఖాయం అనుకోవచ్చు.