Nara Rohit: పెద్దమ్మపై నోరుజారి మాట్లాడితే సహించేది లేదు: నారా రోహిత్

Nara Rohit: చిత్తూరు జిల్లాలో వరద బాధితులకు బాసటగా నిలిచారు, సినీ హీరో నారా రోహిత్.

Update: 2021-11-21 11:45 GMT

Nara Rohit (tv5news.in)

Nara Rohit: చిత్తూరు జిల్లాలో వరద బాధితులకు బాసటగా నిలిచారు, సినీ హీరో నారా రోహిత్. NTR ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు చేస్తున్న వారితో కలిసి కొన్ని కాలనీలకు వెళ్లి పరిస్థితి తెలుసుకున్నారు. బాధితులకు పాలు, పండ్లు అందించారు. సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్న టీడీపీ కార్యకర్తల్ని అభినందించారు.

అంతకుముందు, నారావారిపల్లెకు వెళ్లిన రోహిత్‌.. అక్కడ నాన్నమ్మ అమ్మాణమ్మ, తాతయ్య ఖర్జూర నాయుడికి నివాళులు అర్పించారు. శ్రమశిక్షణతో మెలుగుతున్న తన పెదనాన్న కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలు మనసును బాధించాయన్నారు. తన పెద్దమ్మ భువనేశ్వరిపై వైపీసీ ఎమ్మెల్యేలు నోరుజారి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

నాడు NTR కుమార్తెగా కానీ, చంద్రబాబు సతీమణి హోదాలోకానీ ఎప్పుడూ పెద్దమ్మ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని అన్నారు. సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వారిపై.. నిందలు మోపడానికి నోరెలా వచ్చిందని ప్రశ్నించారు. జీవితంలో ఎన్నడూ లేనంతగా వైసీపీ నేతలు మనసు గాయపరిచినా.. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆమె వరద బాధితులకు సాయం చేస్తున్నారంటూ రోహిత్‌ చెప్పుకొచ్చారు. క్రమశిక్షణకు నందమూరి కుటుంబం మారుపేరు అన్నారు.

Tags:    

Similar News