Anaganaga Oka Raju : సంక్రాంతి రేస్ లో మిస్టర్ పోలిశెట్టి

Update: 2025-05-26 11:30 GMT

సంక్రాంతి అంటే పెద్ద హీరోల సీజన్ అనేది అనఫీషియల్ గా సాగే వ్యవహారం. కొన్నాళ్లుగా కంటెంట్ ను బట్టే కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి చిన్నవాళ్లు కూడా తమ సినిమాపై ఉన్న నమ్మకంతో పెద్దవాళ్లను ఢీ కొడుతున్నారు. ఆ మధ్య హను మాన్ సినిమాలాగా అన్నమాట. ఇప్పుడు ఆ రూట్ లోకే వస్తున్నాడు మిస్టర్ నవీన్ పోలిశెట్టి. అతని లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తోన్న ఈ చిత్రంతో మారి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

నవీన్ పోలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ నటిస్తోంది. ఆ మధ్య వచ్చిన ఈ మూవీ వీడియో గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత నవీన్ కు యాక్సిడెంట్ అయింది. దీంతో అనివార్యంగా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ ఇంత లేట్ అయింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న అనగనగా ఒక రాజు సంక్రాంతి బరిలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 2026 జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అని అనౌన్స్ చేశారు. ఇప్పటికే సంక్రాంతి రేస్ లో మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ షెడ్యూల్ అయి ఉంది. ఇప్పుడు అనగనగా ఒక రాజు. మరి ఇంకా పెద్ద స్టార్స్ ఎవరైనా వస్తే.. పోటీ పెరుగుతుంది.

Tags:    

Similar News