Nayanthara: నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి అయిపోయింది..! ఈ వీడియోనే ప్రూఫ్..
Nayanthara: లాక్‌డౌన్ తర్వాత ఘనంగా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ ఉన్నట్టు విఘ్నేష్ శివన్ తెలిపాడు.;
Nayanthara: గత కొంతకాలంగా ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లి పీటెలక్కుతున్నారు. లాక్‌డౌన్ తరువాతి నుండి చాలామంది సెలబ్రిటీల ఇళ్లల్లో పెళ్లిసందడి మొదలయింది. అయితే ప్రస్తుతం ప్రేమలో ఉన్న నటీనటులు కొందరు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ లిస్ట్‌లో నయనతార కూడా ఉంటుంది. తాజాగా నయన్ పెళ్లి అయిపోయిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. దానికి తోడు ఓ వీడియో కూడా వైరల్‌గా మారుతోంది.
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలాకాలమే అయినా.. నయన్ క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతుందే తప్పా.. తగ్గడం లేదు. నయనతార ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో నటించడమే కాకుండా వారికి పోటీగా రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేస్తోంది.
నయనతార కొంతకాలంగా కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉంది. వీరిద్దరు ఇప్పటికే పెళ్లయిన కపుల్‌లాగా ప్లేస్‌లన్నీ చుట్టేస్తూ.. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే వీరి అభిమానులు పెళ్లి గురించి ఎన్నిసార్లు అడిగినా.. క్లారిటీగా చెప్పలేదు. లాక్‌డౌన్ తర్వాత ఘనంగా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ ఉన్నట్టు విఘ్నేష్ శివన్ తెలిపాడు. కానీ మళ్లీ దాని గురించి ఇప్పటివరకూ ఏమీ మాట్లాడలేదు.
తాజాగా విఘ్నేష్ శివన్, నయనతార తమిళనాడులోని ఓ అమ్మావారి ఆలయానికి వెళ్లారు. అయితే అక్కడే ఉన్న అభిమానులు ఈ జంటను ఫోటోలు, వీడియోలు తీశారు. అలా ఓ ఫ్యాన్ తీసిన వీడియోలో నయనతార నుదుటిపై కుంకుమ పెట్టుకొని కనిపించింది. అది చూసిన నెటిజన్లు నయనతారకు, విఘ్నేశ్‌కు పెళ్లి అయిపోయిందని, అయినా వీరిద్దరు బయటికి చెప్పట్లేదని అభిప్రాయపడుతున్నారు.