ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ పూజా హెగ్దే. 2012 తమిళ మూవీ ముగమూడితో సినిమాల్లోకి వచ్చింది. తర్వాత వరుస ఆఫర్లతో బిజీబిజీగా మారి స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరింది. తొలినాళ్లలోనే అల్లు అర్జున్, జూ. ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో జోడీగా నటించింది. తెలుగు ఫ్యాన్స్ లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. అయితే కొన్నాళ్లుగా ఈ అమ్మడికి అవకాశాలు అంతగా కలిసిరాలేదు. ఆమె ఏ మూవీ చేసినా అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో పూజాహెగ్దే కెరీర్ ముగిసినట్టే అనుకున్నారంతా. కానీ ప్రస్తుతం ఈ అమ్మడికి కాలం కలిసి వస్తోంది. మరోసారి వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఐదు మూవీస్ లో ఆఫర్ కొట్టేసింది. తమిళంలో సూర్య, విజయ్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్
కొట్టేసింది. అలాగే బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా దేవ మూవీలో నటించనుంది. ఈ ఆఫర్లతోనైనా తన కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందేమోనని పూజా చూస్తోంది. దీనిపై పూజా మాట్లాడుతూ.. 'ఫెయిల్యూర్స్ వల్ల ఎప్పుడూ బాధపడలేదు. మంచి సమయం కోసం ఓపిగ్గా ఎదురుచూశాను. భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుందనే నమ్మకం ఉంది' అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.