Anchor Pradeep : ఎమ్మెల్యేతో పెళ్లి వార్తలు.. యాంకర్ ప్రదీప్ ఏమన్నారంటే?
ఓ ఎమ్మెల్యేని పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న వార్తలపై యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజు స్పందించారు. అవన్నీ సరదా ప్రచారాలు మాత్రమేనని కొట్టిపారేశారు. గతంలో రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ అమ్మాయితో వివాహం అన్నారని, త్వరలో క్రికెటర్‌తో మ్యారేజ్ అంటారేమోనని పేర్కొన్నారు. ప్రస్తుతం వివాహానికి సంబంధించిన ప్లాన్ లేదని స్పష్టం చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రదీప్ నటించిన తాజా చిత్రం ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’. నితిన్- భరత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు. తన తల్లి చేతులమీదుగా ట్రైలర్ విడుదల చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ప్రదీప్ తెలిపారు.
‘‘ట్రైలర్ విడుదల గురించి అమ్మకు ముందే చెప్పాను. కాకపోతే ఆమె అందుకు అంగీకరించలేదు. ఆమె ఎప్పుడూ కెమెరా ముందుకురాలేదు. నా ఇష్టాన్ని కాదనలేక చివరకు అంగీకరించారు. మా ట్రైలర్ ఇప్పుడు ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది’’ అని చెప్పారు. తమ చిత్రానికి పవన్‌కల్యాణ్ సినిమా టైటిల్ పెట్టడంపై స్పందిస్తూ.. కథకు అనుగుణంగానే టైటిల్ పెట్టామన్నారు. టైటిల్ తనపై బాధ్యతను పెంచిందని చెప్పారు.