రీసెంట్ గా హరిహర వీరమల్లుతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న బ్యూటీ నిధి అగర్వాల్.. తాజాగా ఓ కాంట్రవర్శీలో ఇరుక్కుంది. ఈ మధ్య తను భీమవరంలో ఓ స్టోర్ ఓపెనింగ్ కు చీఫ్ గెస్ట్ గా వెళ్లింది. ఆ సందర్భంగా తను ఓ ప్రభుత్వ వాహనంలో వెళ్లడం వివాదానికి కారణమైంది. ప్రైవేట్ ఫంక్షన్ కు ప్రభుత్వ వాహనంలో ఎలా వెళుతుంది. ఇదంతా పవన్ కళ్యాణ్ చేశాడు. ప్రభుత్వ అధికారుల తప్పిదం అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. పనిలో పనిగా నిధి అగర్వాల్ క్యారెక్టర్ ను కూడా కొంతమంది బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. ఎలా చూసినా దీన్ని కూటమి ప్రభుత్వానికి కూడా అంటగట్టి ప్రభుత్వ వాహనాలు ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కేటాయిస్తారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై నిధి అగర్వాల్ స్పందించింది. ఈ విషయాన్ని గురించి వివరణ ఇస్తూ ఓ లెటర్ విడుదల చేసింది.
ప్రస్తుతం జరుగుతున్న వివాదం తన దృష్టికి వచ్చిందని.. కానీ ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే.. ఆ రోజు భీమవరం స్టోర్ లాంచ్ ఈవెంట్ కు వెళ్లినప్పుడు తనకు ఆ నిర్వాహకులే వాహనం సమకూర్చారు. కానీ అది ప్రభుత్వ వాహనం అన్న విషయం తనకు తెలియదు అని చెప్పింది. అంతే కాదు.. ఈ విషయంలో ఏ ప్రభుత్వ అధికారికీ సంబందం లేదనీ.. తానెవరినీ అడగలేదని..కేవలం ఆర్గనైజర్స్ ఏర్పాటు చేసిన వాహనంలోనే నేను వెళ్లాను తప్ప.. తనుగా ఏ వాహనమూ కావాలని డిమాండ్ కూడా చేయలేదని ఆ లెటర్ లో తెలిపింది. నన్ను అభిమానించే వారందరికీ తానెంతో విలువ ఇస్తానని అందుకే ఈ వివరణ ఇస్తున్నానని చెప్పింది.
సో.. తనకు ఆ వాహనం కేవలం ఆర్గనైజర్స్ ఏర్పాటు చేశారు తప్ప.. ఏ ప్రభుత్వ అధికారికీ అందులో ప్రమేయం లేదు. కాకపోతే మరి ఆ గవర్నమెంట్ వెహికిల్ ను ఎవరు తీసుకువెళ్లారు అనేది ఓ ప్రశ్న అయితే.. అసలు అది నిజంగా ప్రభుత్వ వాహనమేనా లేక కొంతమంది కావాలనే ఏ.ఐని ఉపయోగించి మార్ఫింగ్ చేశారా అనేది అనుమానం.