Nikhil: మనకి ఆస్కార్లు ఎందుకు: 'ఆర్ఆర్ఆర్' సినిమాపై నిఖిల్ కామెంట్స్..
Nikhil: అవార్డుల కంటే ప్రేక్షక దేవుళ్ల ప్రేమాభిమానాలు ముఖ్యం. తెలుగు సినిమా విడుదలైన అన్ని చోట్లా ప్రజలు ప్రేమాభిమానులు కురిపిస్తున్నారు.;
Nikhil: అవార్డుల కంటే ప్రేక్షక దేవుళ్ల ప్రేమాభిమానాలు ముఖ్యం. తెలుగు సినిమా విడుదలైన అన్ని చోట్లా ప్రజలు ప్రేమాభిమానులు కురిపిస్తున్నారు. మన తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిందంటే అందుకు మన దర్శక, నిర్మాతల ప్రతిభే కారణం.
ఇదే విషయాన్ని హీరో నిఖిలో ఓ ప్రముఖ మీడియా సంస్థతో పంచుకున్నారు. నన్ను క్షమించండి నాకు ఆస్కార్‌పై వ్యతిరేకత లేదు. ప్రతి ఒక్కరూ ఆస్కార్‌ను ఇష్టపడతారు. కానీ ఒక సినిమాకు అతి పెద్ద విజయాన్ని అందించేది ప్రజల ప్రేమ, ప్రశంసలు మాత్రమే. అదే ఆ సినిమాకు అతి పెద్ద అవార్డు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాను ఎంతో ఆదరించారు. అదే ఆ చిత్రానికి అతి పెద్ద విజయం. మరిఇక ఆస్కార్ ఎందుకు.. మనకంటూ కొన్ని అవార్డులు.. ఫిల్మ్‌ఫేర్, జాతీయ అవార్డులు ఉన్నాయి. అందుకే నేను ఆస్కార్‌కు అంత ప్రాముఖ్యం ఇవ్వను అని అన్నారు. ఇలా అన్నందుకు క్షమించండి. నేను స్పెయిన్‌లో ఆర్ఆర్ఆర్ చూశాను. థియేటర్‌లు అన్నీ హౌస్‌ఫుల్‌గా ఉన్నాయి. స్పానిష్ ప్రజలకు ఆ సినిమా ఎంతో నచ్చింది. ఇక మనకి ఆస్కార్ సర్టిఫికేట్ అవసరం లేదని నిఖిల్ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.