Producers : నయనతారకు నోటీసులు ఇవ్వలేదు: నిర్మాతలు

Update: 2025-01-07 11:30 GMT

నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’ సినిమాలోని క్లిప్పింగ్స్ వాడుకున్నందుకు నయనతారకు తాము నోటీసులు ఇచ్చినట్లు వచ్చిన వార్తలను నిర్మాతలు ఖండించారు. తాము రూ.5కోట్లు డిమాండ్ చేయలేదని శివాజీ ప్రొడక్షన్స్ సంస్థ స్పష్టం చేసింది. ఆమె తమ నుంచి ముందే నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నారని తెలిపింది. కాగా ఈ డాక్యుమెంటరీలో ‘నానుం రౌడీదాన్’ క్లిప్స్ వాడినందుకు నయన్‌పై హీరో ధనుష్ రూ.10కోట్లకు దావా వేసిన విషయం తెలిసిందే.

నయనతార లైఫ్​లోని కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్​ను డాక్యుమెంటరీ రూపంలో చూపించేందుకు నెట్​ఫ్లిక్స్ సంస్థ 'నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' అనే వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది విడుదలైన దగ్గరి నుంచి చాలా కాంట్రవర్సీలు ఎదుర్కొంటోంది. తాజాగా ఇందులో 'చంద్రముఖి'లోని కొన్ని సన్నివేశాలు ఉపయోగించడం పట్ల ఆ నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే వీటిపై ఆ సినిమా నిర్మాతలు తాజాగా స్పందించారు.

Tags:    

Similar News