Vijay Devarakonda : కింగ్ డమ్ సౌండ్ ఏదీ..?

Update: 2025-07-14 12:02 GMT

విజయ్ దేవరకొండ తారాజువ్వలా ఎంతలా ఎగిశాడో.. అంతే వేగంగా కిందికి వచ్చాడు. తనపై ఉన్నంత నెగెటివిటీ టాలీవుడ్ లో ఇంకెవరిపైనా లేదు అంటూ ఈ మధ్యకొన్ని ఇంటర్వ్యూస్ లో చెబుతూ వస్తున్నాడు. అయితే సక్సెస్ రేట్ ఉంటే ఈ నెగెటివిటీస్ ఎవరినీ ఏం చేయవు. అదే మనోడికి లోపించింది. ఒక సాలిడ్ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో వస్తోన్న అతని మూవీ కింగ్ డమ్. మాగ్జిమం గ్యారెంటీ ప్రొడక్షన్ అనిపించుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్. సత్యదేవ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫైనల్ గా ఈ నెల 31న విడుదల చేయబోతున్నారు. అయితే ప్రమోషన్స్ పరంగా చూస్తే ఇప్పటి వరకూ ఎలాంటి సౌండ్ కనిపించడం లేదు. ఆ మధ్య వచ్చిన ఎన్టీఆర్ వాయిస్ తో కూడిన టీజర్ ఓకే అనిపించుకుంది. ఫస్ట్ లిరికల్ సాంగ్ ఫర్వాలేదు అనిపించుకుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియోలో టీజర్ విజువల్సే ఉన్నాయి. ఇక ఈ మంగళ వారం రోజు బ్రదర్ సెంటిమెంట్ సాంగ్ విడుదల చేస్తాం అన్నారు. మరి ఆ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచుతుందా అంటే చెప్పలేం.

విజయ్ కి ఈ విజయం చాలా అంటే చాలా కీలకం. కింగ్ డమ్ తో బ్లాక్ బస్టర్ పడితే అతని రేంజ్ కూడా మారుతుంది. ఎందుకంటే రాబోయే ప్రాజెక్ట్స్ భారీగా ఉన్నాయి. ఆ సినిమాలకు క్రేజ్, బిజినెస్ లో బజ్ రావాలంటే కింగ్ డమ్ విజయం చాలా ఇంపార్టెంట్. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న స్థితిలో ఇంకాస్త జోష్ గా ప్రమోషన్స్ చేయాలి. అయితే ఈ మూవీ నిర్మాత నాగవంశీ ప్రమోషన్స్ విషయంలో తనకంటూ ఓ ప్రత్యేకత చూపిస్తాడు. ఆ స్పెషాలిటీస్ ను చూపించాలన్నా పెద్దగా టైమ్ కూడా లేదు. ఇప్పటికే సగం నెల పూర్తవుతోంది. మరోవైపు 24న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఈ 24న విడుదలవుతోంది. ఆ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కింగ్ డమ్ కు ఇబ్బందులు తప్పవు. అలాగని ఆ మూవీ కంటే ముందు భారీ ప్రమోషన్స్ చేసినా ఓ రకంగా సమస్యే. ఇవన్నీ దాటుకుని భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం కాస్త పెద్ద టాస్కే. ఆ టాస్క్ లో ఈ కింగ్ డమ్ పీపుల్ ఎలా ఛేదిస్తారో చూడాలి.

Tags:    

Similar News