జూన్ ఫస్ట్ నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ ఫిల్మ్ ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు. ఇందులో దిల్ రాజు, సునీల్ నారంగ్, మైత్రీ రవి శంకర్ పాల్గొన్నా రు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 'కేవలం ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్లను బంద్ చేస్తున్నామనడం సరికాదు. కొన్ని వార్తలు బిజినెస్ ను దెబ్బతీస్తాయి. ఇండస్ట్రీలో వంద సమస్యలు ఉన్నాయి. అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. వాటిని ఒక్కొ క్కటీ పరిష్కరించుకుంటూ రావాలి. థియేటర్ల పర్సంటేజీ విషయమై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. తర్వాత రోడ్ మ్యాప్ ఏంటనేది నిర్ణయిస్తాం. మూడు సెక్టార్ల నుంచి కమిటీ వేస్తున్నాం. నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరిం చుకుంటాం. ఈనెల 30న జరిగే సమా వేశంలో కమిటీ ఎవరనేది నిర్ణయిస్తం’ అని తెలిపారు.