NTR-Koratal Movie: ఎన్టీఆర్-కొరటాల.. ఏంటి సినిమా ఉందా లేదా!!
NTR-Koratal Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐదేళ్లలో రెండు సినిమాలు మాత్రమే చేశాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చే సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్ కు వెళ్లాడు..;
NTR-Koratal Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐదేళ్లలో రెండు సినిమాలు మాత్రమే చేశాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చే సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్ కు వెళ్లాడు.
మరి ఇంతకీ అసలు కొరటాల సినిమా విషయంలో ఎన్టీఆర్ ఏం నిర్ణయం తీసుకోనున్నాడు అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎన్ని చిన్న సినిమాలు వచ్చినా.. స్టార్ హీరోలు నటించే సినిమాలే ఇండస్ట్రీకి ఊపుని, ఊతాన్ని ఇస్తాయి. ప్రస్తుతం ప్యాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది.
ఈ ట్రెండ్ లోకి ఆర్ఆర్ఆర్ తో ఎంటర్ అయ్యాడు ఎన్టీఆర్. ఆ మూవీ చేస్తుండగానే రామ్ చరణ్.. ఆచార్యలో నటించాడు. అది కంప్లీట్ అయ్యేలోపు శంకర్ తో సినిమా స్టార్ట్ అయింది. శంకర్ సినిమా సెట్స్ లో ఉండగానే రీసెంట్ గా బుచ్చిబాబు ప్రాజెక్ట్‌కు ఓకే చేశాడు చరణ్.
మరి ఎన్టీఆర్‌కు ఏమైంది. ఏ అప్డేటూ లేదు. మొదట త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ ఉందన్నాడు. అది ఆగిపోయింది. తర్వాత ఆచార్య వంటి డిజాస్టర్ ఇచ్చిన కొరటాల శివతో సినిమా అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు. ఈ కాంబినేషన్‌ని ఇప్పుడు ఫ్యాన్స్ కోరుకోవడం లేదు.
మరోవైపు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఏ అప్డేట్ ఇవ్వడం లేదు మేకర్స్ కూడా. దీంతో ఫ్యాన్స్ లో కొంత ఆగ్రహం కూడా కనిపిస్తోంది. దాన్ని వారు మీమ్స్, ట్రోల్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో విషయం ఏంటంటే.. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిల్లోనూ.. 2023 దసరాకు విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారనీ.. టూర్ నుంచి రాగానే సెట్స్ లో అడుగుపెడతాడనీ.. అప్పటి నుంచి నాన్ స్టాప్ గా చిత్రీకరణ చేస్తారని ఇండస్ట్రీలో టాక్. అదే విషయం ఓసారి అనౌన్స్ చేస్తే ఫ్యాన్స్ హ్యాపీగా పీలవుతారు కదా అని ఎన్టీఆర్ అభిమానులు నొచ్చుకుంటున్నారు.