Rajamouli: ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు.. : రాజమౌళి
Rajamouli: నాటు పాట అందరి చేత స్టెప్పులు వేయిస్తే.. తాజాగా విడుదలైన ట్రైలర్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది..;
Rajamouli: జక్కన్న చెక్కిన మరో శిల్పం ఆర్ఆర్ఆర్.. అభిమానులను ఊరించేందుకు సినిమా విడుదలయ్యే లోపు ఒక్కొక్కటిగా వదులుతున్న పదునైన బాణాలు 'ఆర్ఆర్ఆర్' కోసం ఆత్రంగా ఎదురుచూసేలా చేస్తున్నాయి. ఈ చిత్రం నుంచి ఏ చిన్న బిట్ వచ్చినా అభిమానులు ఊగిపోతున్నారు.
నాటు పాట అందరి చేత స్టెప్పులు వేయిస్తే.. తాజాగా విడుదలైన ట్రైలర్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది.. రాజమౌళి సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నా అవి కధానుగుణంగా సాగిపోవడంతో ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు మరో లోకంలో విహరిస్తుంటారు.. థియేటర్‌లో ఉన్నామన్న సంగతి మర్చిపోతారు.
3 నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో తెలిపింది. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టీ పెట్టగానే ఆర్‌ఆర్ఆర్ అందర్నీ పలకరించబోతోంది.. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా 10 భాషలలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఇంత నిడివిగల ట్రైలర్ వచ్చింది లేదు.
విజువల్ వండర్‌గా కట్ చేసిన ఈ ట్రైలర్‌కు సెల్యూట్ చేస్తున్నారు. ట్రైలర్ చూసిన బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ తమ స్పందనను తెలియజేస్తూ దర్శకుడి ప్రతిభను ప్రశంసిస్తున్నారు. దీనిపై రాజమౌళి స్పందిస్తూ.. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు.. ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూసి మా టీమ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నాము అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
— rajamouli ss (@ssrajamouli) December 10, 2021
No words to express and can't say anything more for the #RRRTrailer response from all corners…
Our entire team is overjoyed with the response.:)https://t.co/0oXeghBfpC