టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఓవైపు సినిమాలు చేస్తూనే.. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ ఉంటుంది. తన నటనతో తెలుగు ప్రేక్ష కులకు ఎంతో దగ్గరైంది ఈ మలయాళ బ్యూటీ. అనారోగ్య కార ణాలతో దాదాపు ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడిప్పుడే మళ్లీ నటనలో జోరు పెంచుతోంది. తాజాగా బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన షూటింగ్ జరుగు తోంది. తాజాగా సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వెకేషన్ భాగంగా రాజస్థాన్లో ఉన్న ఈ అమ్మడు అక్కడ మట్టి పాత్రలను చేస్తూ దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. దీంతోపాటు 'సంతోషకరమైన కొన్ని రోజులు.. ఇప్పుడు నవంబర్ కోసం సిద్ధంగా ఉన్నాను' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఆ పోస్టులకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.