NTR - Neel : ఎన్టీఆర్, నీల్.. షూటింగ్ చేస్తున్నారా.. వెకేషన్ లో ఉన్నారా..?
ఈ పిక్ చూడగానే చాలామంది అనుకుంటున్నది ఇదే. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మూవీ రూపొందుతోంది. ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రశాంత్ నెల క్రితమే షూటింగ్ ప్రారంభించాడు. ఫస్ట్ షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం బెంగళూరులో చిత్రీకరణ చేస్తున్నారు. ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ ఉన్నాడు. అయితే షూట్ గ్యాప్ లో వీరిద్దరూ భార్యలతో కలిసి చిల్ అవుతున్న స్టిల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వాళ్లంతా వీళు షూటింగ్ చేస్తున్నారా లేక షూటింగ్ నే వెకేషన్ లాగా ఎంజాయ్ చేస్తున్నారా అని కమెంట్స్ పెడుతున్నారు.
రీసెంట్ గానే ప్రశాంత్ నీల్ భార్య లొకేషన్ నుంచి ఒక ఫోటో షేర్ చేసింది. దానికే చాలామంది ముచ్చటపడిపోయారు. ఇప్పుడు ఎన్టీఆర్ వైఫ్ కూడా జాయిన్ అయింది. నలుగురూ కలిసి ఏదో హిల్ స్టేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ స్టిల్ చూడముచ్చటగా ఉంది. పైగా నలుగురూ పగలబడి నవ్వుతున్నారు. మరి అంత పెద్ద జోక్ ఎవరు వేశారో కానీ ఈ స్టిల్ వైరల్ మారింది.
ఇక డ్రాగన్ నుంచి ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ఓ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నారు అనే టాక్ ఉంది. ఈ గ్లింప్ తో ఎంటైర్ ఇండస్ట్రీ ఉలిక్కిపడుతుందంటున్నారు. సినిమాను 2025 జూన్ 25న విడుదల చేస్తాం అని గతంలోనే ప్రకటించారు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేస్తుండగా.. టోవినో థామస్, బిజూ మీనన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.