మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఓ షూటింగ్ లో ప్రమాదం బారిన పడ్డాడు. కాలికి గాయమైంది. ప్రమాదం తీవ్రమైనదేం కాదు. స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీఆర్ కు ప్రమాదం అనగానే చాలామందికి 2009 ఎన్నికల ప్రచారం నాటి యాక్సిడెంట్ గుర్తుకు వస్తుంది. పైగా ఆయన ఫ్యామిలీలో ఇద్దరు ముఖ్యులు కూడా యాక్సిడెంట్ కారణంగానే మరణించారు. అందుకే ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించి ప్రమాదం అనగానే చాలామంది అభిమానులు భయపడ్డారు. బట్ ఇది భయపడేంత పెద్ద విషయం కాదు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు.
తాజాగా ఎన్టీఆర్ హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్ చేస్తున్నాడు. ఈ షూటింగ్ లోనే ఆయన ప్రమాదం బారిన పడి చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఇది కాక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. సో.. ఈ ఘటన షూటింగ్స్ లో ఆయన కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది అనుకోవచ్చు.