థియేటర్ రికార్డ్స్ నే కాదు.. ఇప్పుడు డిజిటల్ రికార్డ్స్ ను కూడా స్టార్డమ్ కు ప్రతీకగా చూపించుకుంటున్నారు హీరోలు, వారి అభిమానులు. అందుకే థియేటర్ కలెక్షన్స్ నుంచి ఎన్ని థియేటర్స్ లో ఎన్ని రోజులు ఆడింది అనేది దాటి.. ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ వరకూ వచ్చారు. ఇటు డిజిటల్ వస్తే.. పాటలో, టీజర్, ట్రైలర్లో ఇవి ఎన్ని మిలియన్ వ్యూస్ దక్కించుకున్నాయి నుంచి ఓటిటిలో ఎంతమంది చూశారు, టివిల్లో రేటింగ్ ఎంత వచ్చింది వరకూ కాలిక్యులేట్ చేసుకుంటున్నారు.
అలా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో టాప్ టెన్ లో నిలిచి సత్తా చాటుతోంది ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ మళయాల మూవీలో కుంచకో బోబన్, ప్రియమణి, జగదీష్, వైశాఖ్ నాయర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నాన్ ఇంగ్లీష్ మూవీస్ కేటగిరీలో ఇప్పటికీ నెట్ ఫ్లిక్స్ లో టాప్ టెన్ లిస్ట్ లో 10వ స్థానంలో నిలిచింది. అంతే కాక మరో అరుదైన రికార్డ్ ను కూడా సాధించింది.
సౌత్ ఇండియా నుంచి హయ్యొస్ట్ వ్యూవర్ షిప్ సాధించిన సినిమాల్లో రెండో స్థానంలో ఉంది. సో.. ఫస్ట్ ప్లేస్ లో పుష్ప 2 ఉంది. ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం ఓటిటిలో మార్చి 20నుంచి స్ట్రీమ్ అవుతోంది. అప్పటి నుంచి ఈ మూడు వారాల్లో ఈ చిత్రం ఇప్పటి వరకూ 2.3 మిలియన్ వ్యూయింగ్ అవర్స్ ను సొంతం చేసుకుంది. అంటే 2.3 మిలియన్ గంటల సేపు ఆఫీసర్ ఆన్ డ్యూటీని నెట్ ఫ్లిక్స్ లో చూశారు. పుష్ప 2 తర్వాత సౌత్ నుంచి అంత హయ్యొస్ట్ వ్యూయర్ షిప్ సాధించిన సినిమా ఇదే కావడం విశేషం.
ఇక పుష్ప 2 విషయానికి వస్తే ఈ మూవీని క్రాస్ చేయడం ఇప్పట్లో సాధ్యం కాదేమో అనిపిస్తుంది. పుష్ప 2 ఏకంగా 5.8 వ్యూస్ ను కేవలం ఒక్క వారంలోనే సాధించింది. అదో అరుదైన రికార్డ్ అనే చెప్పాలి. ఓవరాల్ గా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ఎక్కువ గంటలు చూసిన సినిమాల లిస్ట్ లో పుష్ప 2 సెకండ్ ప్లేస్ లో ఉంది.