యూఎస్ మార్కెట్ లో 'ఓజీ' విధ్వంసం

Update: 2025-09-20 08:16 GMT

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో 'ఓజీ' ఒకటి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబోలో ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ మూవీ ఈనెల 25న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ప్రమోషన్స్

స్పీడప్ చేసిన మేకర్స్.. ఈనెల 21న ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అయితే భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఎగ్జెటింగ్లో ఉండగా.. అంచనాలు అంతకంతకు పెరుగుతూ వెళుతున్నాయి. ఇక యూఎస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా సంచలన వసూళ్లతో అదరగొడుతుంది. ఇంకా ఎలాంటి ట్రైలర్ రాకుండానే అప్పుడే అక్కడ 1.75 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని ప్రీ సేల్స్ రూపంలో అందుకొని దుమ్ము లేపింది. ఇదే మూమెంటం కొనసాగితే మాత్రం ట్రైలర్ వచ్చే లోపే 2 మిలియన్ డాలర్స్ మార్క్ దాటే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్అందించాడు.

Tags:    

Similar News