Tollywood : 'ఓజీ' కొట్టేది ఎట్టా ఉండాలంటే

Update: 2024-11-21 09:15 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ(ఓజాస్ గంభీర). సాహూ చిత్ర దర్శకుడు సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పవన్ తన కెరీర్ లో ఫస్ట్ టైం గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. దాంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. కొంత కాలంగా ఓజీ సినిమా అప్డేట్స్ గురించి న్యూస్ వైరల్ అవుతున్న వేల తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు ఓజీ మేకర్స్. "ఈ సారి మనం ‘ఓజీ’ కొట్టేది ఎట్టా ఉండాలంటే’’ అంటూ నిర్మాత కళ్యాణ్ దాసరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో త్వరలోనే ఈ సినిమా నుండి అప్డేట్ ఉండనుంది అంటూ చెప్పుకొచ్చారు మేకర్స్. మరి ఎలాంటి అప్డేట్ ఇస్తారు అనేది చూడాలి.

Tags:    

Similar News